రాజుపేట ప్రజల కలలు నెరవేరుతున్నాయి బస్టాండ్ నుంచి బైపాస్ వరకు రహదారి చివరి దశకు
రాజుపేట ప్రజల కలలు నెరవేరుతున్నాయి బస్టాండ్ నుంచి బైపాస్ వరకు రహదారి చివరి దశకు
తిరువూరు, జనవరి 31,(వెలుగు నాడు ప్రతినిధి ) : తిరువూరు,ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న బస్టాండ్ నుంచి బైపాస్ వరకు రహదారి నిర్మాణం ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో రాజుపేటతో పాటు పరిసర ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.ఈ రహదారి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే* కాకుండా, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు* *ప్రయాణించే వేలాది మంది ప్రజలకు ఊరటనిచ్చే మార్గంగా మారనుంది.ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాజకీయంగా విభేదాలు, విమర్శలు, ఒత్తిళ్లు ఎదురైనా ఆయన తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదని అనుచరులు అభిప్రాయపడుతున్నారు.తిరువూరు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనేక విమర్శలు, వివాదాలు ఎదురైనప్పటికీ ఎక్కడా అసహనానికి తావివ్వకుండా, అభివృద్ధి పనులపైనే దృష్టి సారించడం ఆయన ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. పార్టీ స్థాయిలో క్రమశిక్షణ చర్యలు ఎదురైన సందర్భాలున్నప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన కొనసాగిన తీరు గమనార్హమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన ఈ రహదారి పనులు ఇప్పుడు వేగంగా పూర్తికావడం స్థానికులకు ఊరట కలిగిస్తోంది. రహదారి పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా వ్యాపారం, రవాణా, ప్రజల దైనందిన ప్రయాణం సులభతరం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.ఇప్పటివరకు అభివృద్ధి జరగదని విమర్శించిన వారికీ, ఈ ప్రాజెక్టు పురోగతి ఒక ప్రత్యక్ష సమాధానమని అనుచరులు అంటున్నారు. రహదారి పూర్తయిన తరువాత తిరువూరు ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త దిశనిచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజుపేట ప్రజల ఎన్నో ఏళ్ల కల ఇప్పుడు నిజమవుతుండగా, ఈ మార్గం ప్రాంతీయ అభివృద్ధికి కీలకంగా మారబోతుందని ప్రజలు భావిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
2