ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ప్రమాణ స్వీకారం
ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ప్రమాణ స్వీకారం
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 04,( వెలుగు నాడు ప్రతినిధి ) : శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానంలో బుధవారం నూతన వంశపారంపర్య ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఆలయ నూతన వ్యవస్థాపక ధర్మకర్తగా శ్రీరాం బదరీ నారాయణరావు కుమారుడు శ్రీరాం సంజయ్ కృష్ణ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) హాజరై నూతన ధర్మకర్తకు శుభాకాంక్షలు తెలిపారు.రంగనాయక స్వామి దేవస్థానం ఈవో జయ ప్రకాశ్ ఆధ్వర్యంలో తిరునగరి రామకృష్ణచార్యులు వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.శ్రీరాం సుబ్బారావు, శ్రీరాం రామకృష్ణ, శ్రీరాం బద్రి,డాక్టర్ యోగిరాం, శ్రీరాం రాంబాబు, ప్రసాద్ ,నూకల కుమార్ రాజా, పెనుగొండ రాజీవ్, తదితర ప్రముఖులు పాల్గొని నూతన ధర్మకర్తకు శుభాకాంక్షలు తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0