చిన్నారుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

May 16, 2026 - 22:13
 0  4
చిన్నారుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

చిన్నారుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ 

విజయవాడ మే16 ,( వెలుగు నాడు ప్రతినిధి) : ఆంధ్రాలో చిన్నారుల చదువుల ప్రాజెక్ట్ (ఏసీసీహెచ్ఏ) ను ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా జి లక్ష్మీశ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారితో కలిసి శనివారం ప్రారంభించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన ముందస్తు విద్య, ఆటపాటల ద్వారా అభ్యాసం, సమగ్ర అభివృద్ధి కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందిస్తూ,చిన్నారుల భవిష్యత్తు నిర్మాణంలో వారి పాత్ర కీలకమని అన్నారు.తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తే అంగన్వాడీ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్