డంపింగ్ యార్డ లా మారిన రోడ్డు
డంపింగ్ యార్డ లా మారిన రోడ్డు
ఇబ్రహీంపట్నం పాత పంచాయతీ కార్యాలయం సమీపంలో రోడ్డు దుస్థితి
మొర పెట్టుకుంటున్న స్పందించని మున్సిపల్ అధికారులు
వాహనాలు,స్కూల్ పిల్లలు, పాద చారుల అవస్థలు
ఎన్టీఆర్ బ్యూరో, మార్చి 29,( వెలుగు నాడు ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులో ఆక్రమణలకు అడ్డు లేకుండా పోయింది. ఇక రోడ్డు మార్జిన్ సంగతి అయితే చెప్పనవసరం లేదు... ఒక దశలో డంపింగ్ యార్డ్ ను తలపించేలా రోడ్డు అధ్వానంగా మారిపోయింది. పాత పంచాయతీ కార్యాలయానికి సమీపంలో రోడ్డు పరిస్థితి అత్యంత దుర్భర పరిస్థితిలో ఉంది. రోడ్డు మార్జిన్ కనిపించకుండా ఆక్రమణలతో నింపేశారు. వేస్ట్ మెటీరియల్, చెత్తాచెదారంతో, డివైడర్ పై సైతం చెత్త కుండీల మార్చారు. స్థానికంగా ఉన్న వ్యాపార సముదాయాలు ఎందుకు కారణం. స్థానికంగా ఉన్న కార్ వాష్ రోడ్డును ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తున్నారు. లోపల వేస్ట్ మెటీరియల్ అంతా రోడ్డుపై వేస్తున్నాడు. దీంతో అటుగా వెళుతున్న స్కూలు పిల్లలు, పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు మీ ప్రశ్నించిన వారిపై రోడ్డు నీదా దుర్భాషలాడుతున్నారు. రోడ్డు మార్జిన్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా ఉందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన కనీసం పట్టించుకోవట్లేదు అని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్ స్పందించి ఆక్రమాలను తొలగించి రోడ్డు మార్జిన్ ఏర్పాటు చేయాలని, పిల్లల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0