శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం 

Feb 13, 2026 - 21:56
 0  9
శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం 

శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం 

జగ్గయ్యపేట,ఫిబ్రవరి 13, (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణ సమీపంలోని వి ఎస్ పి క్వార్టర్స్ ప్రాంగణంలో ఉన్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 32వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు.వి ఎస్ పి పూర్వ ఉద్యోగి బి భీమరాజు,దుర్గ దంపతులచే స్వామివారి కల్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.ఆలయ అర్చకులు టి ఎల్ ఎన్ ఆచార్యులు ఆధ్వర్యంలో తిరునగరి సంపత్ జానకిరామ్ కళ్యాణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వి ఎస్ పి జె ఎల్ ఎమ్ ఇన్చార్జ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో జేఎల్ఎం ఇన్చార్జ్ కిరణ్ కుమార్, వి ఎస్ పి ఉద్యోగులు, పూర్వ ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్