ఇది ప్రగతి సాధక ప్రజా బడ్జెట్ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

Feb 16, 2026 - 22:51
 0  13
ఇది ప్రగతి సాధక ప్రజా బడ్జెట్ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

ఇది ప్రగతి సాధక ప్రజా బడ్జెట్ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట, ఫిబ్రవరి16, (వెలుగు నాడు ప్రతినిధి) : రాష్ట్ర బడ్జెట్ ప్రజల జీవితాల్లో వెలుగును నింపే ప్రగతి సాధక బడ్జెట్ అని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి తాతయ్య మాట్లాడారు.ఈ బడ్జెట్ కోట్లాది ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చే విజన్ డాక్యుమెంట్ అన్నారు.బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.రూ 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మూలధన వ్యయానికి రూ 53,915 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ 13,598 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ 18,224 కోట్లు,గృహనిర్మాణానికి రూ 6,357 కోట్లు కేటాయించారని తెలిపారు. సంక్షేమానికి మొత్తం రూ 91,527 కోట్లు కేటాయించగా, బీసీల అభివృద్ధికి రూ 51,021 కోట్లు, ఎస్టీలకు రూ.9,190 కోట్లు, మైనార్టీలకు రూ 6,090 కోట్లు, మహిళా,శిశు,వికలాంగుల సంక్షేమానికి రూ4,582 కోట్లు కేటాయించారని వివరించారు.విద్యా రంగానికి గణనీయంగా నిధులు కేటాయించారని తెలిపారు.అన్నదాత సుఖీభవ పథకానికి రూ 6,600 కోట్లు కేటాయించడం రైతులకు పెద్ద ఊరట కలిగిస్తుందని అన్నారు.విజన్ 2047 లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, మేక వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్స్ వెంకట్, గొట్టే నాగరాజు,నాయకులు కర్రి చిన్న,అనిల్, శ్రీను, వెల్ది శ్రీను, కర్ల జోజి,షేక్ అస్లాం, గింజుపల్లి కృష్ణ, మోసిన్,వెంకటేశ్వరరావు,వెల్ది అప్పారావు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్