వేగంగా సాగుతున్న టిడ్కో గృహాలపనులు మ్మెల్యే శ్రీరాం తాతయ్య
వేగంగా సాగుతున్న టిడ్కో గృహాలపనులు మ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, మార్చి10 ,(వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పేద ప్రజల దశాబ్దాల కల అయిన సొంతింటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నడుం బిగించారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని టిడ్కో గృహ సముదాయాలను మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో, పేదవాడికి ఇల్లు దక్కకూడదనే దుర్బుద్ధితో ఈ ప్రాజెక్టును గాలికొదిలేసింది. ఐదేళ్ల పాటు ఈ ఇళ్లను పట్టించుకోకపోవడంతో అడవి మొక్కలు మొలిచి, పాములకు నిలయంగా మారాయి. లబ్ధిదారులు తాము కట్టిన సొమ్ము ఏమవుతుందోనని ఆందోళన చెందారు. చంద్రబాబు నాయుడు ముందస్తు చూపు వల్లే, ఐదేళ్ల పాటు ఎటువంటి నిర్వహణ లేకపోయినా ఈ భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా పటిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వీటికి మెరుగులు దిద్ది, మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అప్పగించబోతోందని అన్నారు.జగ్గయ్యపేట పట్టణ పరిధిలో మొత్తం 3,180 గృహాలను వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఫేస్-1 ప్రణాళికలో మొదటి విడతలో భాగంగా 1,480 ఇళ్లను మౌళిక వసతులతో సహా పూర్తి చేసి, వచ్చే జూన్ నాటికి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, గింజుపల్లి వెంకట్రావు, సంగెపు బుజ్జిబాబు, కర్ల జోజి , గుమ్మ వెంకటేష్, టిడ్కో ఇంజనీర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0