నేడే పార్వతీ,పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ముస్తాబైన ముక్త్యాల,కోటిలింగాల శైవక్షేత్రాలు
నేడే పార్వతీ,పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ముస్తాబైన ముక్త్యాల,కోటిలింగాల శైవక్షేత్రాలు
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 14, (వెలుగు నాడు ప్రతినిధి) : మండలంలోని ముక్త్యాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం,కోటిలింగాలలోని శ్రీ కామాక్షీ సహిత అమృత లింగేశ్వర స్వామి వారి ఆలయాలలో మహా శివరాత్రి సందర్భంగా నేటి అర్ధరాత్రి జరుగనున్న ఆది దంపతుల కళ్యాణ వేడుకలకు సర్వం సంసిద్ధం చేశారు.ట్రాఫిక్ నియంత్రణను జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరరావు సమీక్షించారు. కెసిపి యాజమాన్యం డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరాదత్తు సౌజన్యంతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ నదీ స్నాన ఘట్టాలను,దర్శనం క్యూలైన్లను,ప్రసాదం కౌంటర్లను పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు. కృష్ణా నది ఇక్కడ ఉత్తర వాహిని.మహాశివరాత్రి పర్వదినాన పావన కృష్ణా నదిలో స్నానాలాచరించి,ఇక్కడ వెలసిన భవానీ సమేత ముక్తేశ్వర స్వామిని దర్శించడం పుణ్యప్రదం,మోక్ష ప్రదమని భక్తులు భావిస్తారు.ఆందుకే మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి కృష్ణా జిల్లా నుండే కాకుండా గుంటూరు,నల్గొండ,ఖమ్మం జిల్లాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తారు.ముక్త్యాల క్షేత్రం తోబాటు కోటిలింగాల మహాక్షేత్రాన్ని కూడా సందర్శిస్తారు.భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ జగ్గయ్యపేట డిపో ఆది,సోమవారాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతోంది.వివిధ ప్రభుత్వ శాఖలవారు భక్తులకు సేవలందించడానికి సర్వం సంసిద్ధం చేస్తున్నారు.జాగరణ చేసే భక్తులకోసం ఆదివారం రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0