నగరవాసులు మెచ్చే విధంగా సంప్రదాయ వధూ-వరుల జ్యువెలరీ ఎక్స్ పో
నగరవాసులు మెచ్చే విధంగా సంప్రదాయ వధూ-వరుల జ్యువెలరీ ఎక్స్ పో
వసుంధర డైమండ్ రూఫ్ ఎక్స్ పో ను ప్రారంభించిన ఎంపీ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ
ఎన్టీఆర్ బ్యూరో ఫిబ్రవరి 10 (వెలుగునాడు ప్రతినిధి) : జిల్లా పరిధిలోని,విజయవాడ నగరంలో లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ లో మంగళవారం వసుంధర డైమండ్ రూఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ వధూ–వరుల జ్యువెలరీ ఎక్స్ పో ను ముఖ్యఅతిథులుగా హాజరైన విజయవాడ ఎంపీ సతీమణి కేశినేని జానకీ లక్ష్మి,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సతీమణి బొండా సుజాత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్ పీతల సుజాత లతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఎక్స్ పో నిర్వహకులు ఈ ముగ్గురికి ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం ప్రత్యేక డిజైన్లతో ఆకర్షీణీయంగా తయారు చేసిన వివిధ రకాల బంగారు ఆభరణానలను, వజ్రాభరణాలను వారు ఆసక్తి గా తిలకించారు. నిర్వహకులు ఆ అభరణాల ప్రత్యేకతను వివరించారు. ఈ సందర్బంగా కేశినేని జానకీలక్ష్మీ మాట్లాడుతూ మహిళలకు బంగారు ఆభరణాలంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుందన్నారు. కస్టమర్ల కు ఒకేచోట విభిన్న కలెక్షన్లను అందుబాటులో ఉండేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వహకులకి అభినందనలు తెలిపారు.తనని ఈ కార్యక్రమానికి ఆహ్వానించటం చాలా సంతోషంగా వుందన్నారు. అమెరికాలో వసుంధర జ్యువెలరీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కూడా సందర్శించటం జరిగిందన్నారు. గత 29 ఏళ్లుగా వసుంధర వారు మంచి నాణ్యత గల నగల తయారీలో విశేష అనుభవంతో ప్రజల ఆదరణ పొందుతున్నారని.ఇక్కడ ప్రదర్శించిన అన్ని నగలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.అలాగే తనకి వ్యక్తిగతంగా ట్రెడిషనల్ నగలంటే చాలా ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం తగ్గిపోతున్న సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న నగల తయారీని వసుంధర వారు కొనసాగించడం అభినందనీయమన్నారు.తెలంగాణలోని సాధారణ మహిళలు ధరించే సంప్రదాయ నగలు,పూసల గొలుసు వంటి ఆభరణాలను కూడా ఇక్కడ అందుబాటులో వుండటం చాలా ఆనందంగా వుందన్నారు.వసుంధర డైమండ్ రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర మాట్లాడుతూ తమ సంస్థ హైదరాబాద్‌లో ప్రారంభించి 29 సంవత్సరాలు పూర్తయిందని, కస్టమర్ల ఆదరణతో దినదినాభివృద్ధి చెందిందని,అపూర్వమైన డిజైన్లు, నాణ్యత,వినియోగదారుల సంతృప్తే తమ సంస్థకు ప్రత్యేక గుర్తింపని తెలిపారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వసుంధర డైమండ్ రూప్స్ విజయవాడ షో రూమ్ హెడ్ అట్లూరి మేఘన తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0