ఉద్యానపంటల్లో సస్యరక్షణపై శిక్షణ
ఉద్యానపంటల్లో సస్యరక్షణపై శిక్షణ
జగ్గయ్యపేట ఫిబ్రవరి10 (వెలుగు నాడు ప్రతినిధి) : మండలంలోని బుదవాడ గ్రామంలో ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సమస్యలపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె వి కె ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కే లక్ష్మీకళ మిరపలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు వాటి నివారణ చర్యలు,అలాగే మిరపలో జీవ సిలింద్ర నాశని ట్రైకోడెర్మా విరిడే ఉపయోగం,జీవన ఎరువుల వాడకం, జిగురు అట్టల ఆవశ్యకతను వివరించారు.ఉద్యాన అధికారి నీలిమ, ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ పథకాలను రైతులకు వివరించారు. తరువాత ట్రైకోడెర్మా విరిడే ఉపయోగించి మిరప సాగు చేస్తున్న రైతు రామోజీ నాయక్ మిరప తోటను సందర్శించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0