మొక్కజొన్న పంట యాజమాన్యంపై శిక్షణ
మొక్కజొన్న పంట యాజమాన్యంపై శిక్షణ
జగ్గయ్యపేట, జనవరి29,( వెలుగు నాడు ప్రతినిధి) : పోచవరం, వత్సవాయి మండలం పోచవరం గ్రామంలో రైతులకి రబీ మొక్కజొన్న లో సమగ్ర పంట యాజమాన్యం మీద మరియు జీవన ఎరువులతో నేల ఆరోగ్య పరిరక్షణ మీద గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని,జిల్లా వనరుల కేంద్రం డిడిఏ వెంకటేశ్వర్లు,సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ శివప్రసాద్,మండల ఉద్యాన అధికారి నీలిమ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతులకు రబి పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో మొక్కజొన్న లో పంటల లో చీడపీడల యాజమాన్య పద్ధతులు,ఎరువుల యాజమాన్యం, జీవన ఎరువులు వల్ల ఉపయోగాలు మరియు ద్రవరూప ఘనరూప జీవన ఎరువుల యొక్క ఉపయోగాలు వాడే విధానాల గురించి, రబీలో జింక్ లోపం యాజమాన్యం గురించి వివరించారు.అలాగే వివిధ పంటల్లో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత మరియు వివిధ సూక్ష్మ మరియు స్థుల పోషకాల స్థిరీకరణ గురించి వివరించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సందేహాలను నివృతి చేసి మొక్కజొన్న పంటలలో సమగ్ర యాజమాన్య మీద ప్రచురణాలను రైతులకి అందించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ హరికృష్ణ రెడ్డి, గ్రామ పెద్దలు, వ్యవసాయ సిబ్బంది, ఏపీ సీయన్ఎఫ్ సిబ్బంది, రైతులు, గ్రామీణ యువత పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0