వేద హెర్బల్ ,ఆర్గానిక్ స్టోర్ ప్రారంభం
వేద హెర్బల్ ,ఆర్గానిక్ స్టోర్ ప్రారంభం
జగ్గయ్యపేట మే13 , (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన మైలవరపు రామ నరసింహారావు నూతనంగా ఏర్పాటు చేసిన “వేద హార్బల్, ఆర్గానిక్ స్టోర్” ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొని స్టోర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని, సహజసిద్ధమైన ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ప్రజలకు నాణ్యమైన హార్బల్, ఆర్గానిక్ ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ స్టోర్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపార వేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0