పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు

Mar 18, 2026 - 11:00
 0  16
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు.

తిరువూరు, మార్చి 17 (వెలుగు నాడు ప్రతినిధి) : పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరువూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు జాకీర్ భాయ్, ఖాసీం భాయ్, కరీమ్, రఫీ, చోటు భాయ్,వాహబ్, గఫార్ తదితరులు పాల్గొని దేశం, రాష్ట్రం శాంతి-సమృద్ధులు సాధించాలని ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ.రంజాన్ మాసం మనకు శాంతి, సహనం, సౌభ్రాతృత్వం నేర్పే పవిత్ర కాలమని, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో వైసీపీ పట్టణ అధ్యక్షులు రేగళ్ల మోహనరెడ్డి, పరసా శ్రీనివాసరావు ( బాబు ), మోదుగు ప్రసాద్, ఏరువ ప్రకాష్ రెడ్డి, కాలసాని నాగేశ్వరరావు, తిరుమలశెట్టి వేణు,తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 1
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్