సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యం
సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యం
నందిగామ, జనవరి 31, (వెలుగు నాడు ప్రతినిధి) : గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం ముందుకు సాగుతాయి.ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య . గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ తంగిరాల సౌమ్య అన్నారు.వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జల్లి ఏసోబు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, దాతల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తంగిరాల సౌమ్య ప్రజలందరి సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన స్వగ్రామమైన జుజ్జూరు అభివృద్ధికి మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ విశేష కృషి చేశారని కొనియాడారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన చూపిన చొరవ అభినందనీయమని, ఆయన ఆశయం మహోన్నతమైనదైనందునే నేడు ఈ భవనం గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని తంగిరాల సౌమ్య తెలిపారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కూటమి నేతలు,గ్రామ/ మండల తెదేపా నేతలు స్థానీక ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0