ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తా
ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తా
వత్సవాయి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకట్
వత్సవాయి ,మార్చి 17, (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్టీఆర్జి జిల్లా వత్సవాయి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా బుర్రి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ ఎంపికపై పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు.వత్సవాయి మండలంలో నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు బుర్రి వెంకట్ ను మండలంలోని పాత్రికేయుల సమావేశం మంగళవారం నిర్వహించి,అందరి సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నారు.జర్నలిజం రంగంలో ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, వార్తా రంగానికి విశేష సేవలు అందిస్తున్న బుర్రి వెంకట్ కు ఈ పదవి దక్కడం పట్ల పాత్రికేయులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ, బుర్రి వెంకట్ ఎప్పుడూ నిజాయితీతో వార్తలను ప్రజలకు చేరవేస్తూ, జర్నలిస్టుల సమస్యలపై కూడా ముందుండి పోరాడుతున్నారని అన్నారు. మండలంలోని అందరు మీడియా ప్రతినిధులను ఐక్యంగా ఉంచి, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేయగల సామర్థ్యం ఆయనకు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బుర్రి వెంకట్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి పాత్రికేయుడికి కృతజ్ఞతలు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0