వరికపూడిసెల ప్రాజెక్టు పనులను వెంటనే మొదలుపెట్టాలి

Mar 26, 2026 - 22:56
 0  2
వరికపూడిసెల ప్రాజెక్టు పనులను వెంటనే మొదలుపెట్టాలి

వరికపూడిసెల ప్రాజెక్టు పనులను వెంటనే మొదలుపెట్టాలి.

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి రామానాయుడుకు వినతి పత్రంఅందించిన వరికపూడిసెల సాధన సమితి సభ్యులు 

మాచర్ల పలనాడు మార్చి 26 వెలుగు నాడు ప్రతినిధి) : వెనకబడిన పలనాడు ప్రాంతానికి చెందిన వరికపూడిసెల ప్రాజెక్టు పనులను మొదలు పెట్టాలని రాష్ట్ర సచివాలయం లోని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయం నందు ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. ఆ కార్యక్రమంలో పలనాడు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మరియు టీటీడీ కార్యవర్గ సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొని, సాధన సమితి సభ్యులతో పాటుగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు కు వరికపూడిసెల ప్రాజెక్టు కట్టడం వల్ల పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతూ, అభివృద్ధికి మారుపేరుగా పలనాడు చెందుతుందని, అదేవిధంగా పలనాడు ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని మంత్రి కి వివరించారు. పలనాడు ప్రాంతంలో ఎన్నో దశాబ్దాలుగా శిలాఫలకాలపై మాత్రమే వరికపూడి ప్రాజెక్టు నామకరణం జరుగుతుంది. కానీ పనులు మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి రామానాయుడు సానుకూలంగా స్పందించి, ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి మా దృష్టిలో ఉందని, ఆ విషయం పై మండలంలో చర్చించామని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ , సమాచార మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారధిని తన కార్యాలయంలో కలిసి వరికపూడిసెల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరికపూడిసెల సాధన సమితి అధ్యక్షులు భక్తులు వీరయ్య, ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను, సాంబశివరావు, వెంకట్రావు, వీరాస్వామి, నాగ శేషయ్య, అశోక్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్