జనసందోహంతో, సంప్రదాయ వైభవంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Jan 15, 2026 - 07:05
 0  2
జనసందోహంతో, సంప్రదాయ వైభవంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు

జగ్గయ్యపేట జనవరి 14, (వెలుగు నాడు న్యూస్) :  తెలుగు ప్రజల జీవన విధానానికి, రైతు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జగ్గయ్యపేట మండలంలోని  బండిపాలెం గ్రామంలో శ్రీకృష్ణ గీత మందిరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అపూర్వ వైభవంతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. సంప్రదాయం, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు గ్రామమంతా పండుగ కళను అద్దుకుని, ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను పంచాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామ ప్రజలందరూ కుటుంబసమేతంగా ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు.ఈ విశిష్ట కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘు రాం  ముఖ్య అతిథిగా హాజరై బండిపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించి సంబరాలకు మరింత శోభను చేకూర్చారు. గ్రామీణ సంస్కృతి పట్ల ఆయన చూపిన ఆదరణ, సంప్రదాయాల పట్ల ఉన్న అభిమానానికి ఇది స్పష్టమైన నిదర్శనమని గ్రామస్తులు ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా మహానేత ఎన్టీ రామారావు విగ్రహానికి నెట్టెం శ్రీ రఘు రాం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం ట్రాక్టర్‌పై గ్రామంలో శోభాయాత్రగా సంక్రాంతి సంబరాలు నిర్వహించే ప్రాంగణానికి చేరుకొని ప్రజలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ దృశ్యం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ముఖ్య అతిథి నెట్టెం శ్రీ రఘు రాం మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రైతుల శ్రమకు గౌరవ సూచకంగా, ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తుచేసే మహత్తర పండుగ అని పేర్కొన్నారు. గ్రామీణ జీవన విలువలు, తెలుగు సంప్రదాయాలు మన అసలైన గుర్తింపని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకొని గర్వంగా భవిష్యత్తుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గ్రామాలు బలంగా నిలబడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే తన జీవిత ఆశయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మహిళలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, వారి ఆనందంలో భాగస్వాములై ఉత్సవాలకు మరింత ఉత్సాహాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్  వైస్ చైర్మన్ అడుసుపల్లి ప్రభాకర్ రావు, సర్పంచ్ నెమలి ఎలీసమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు, బండి శ్రీకాంత్ సొసైటీ అధ్యక్షులు బోల్నిడి అప్పారావు పొందురు విశ్వనాధం చుండు పూర్ణయ్య ఇన్నమూరి రమేష్ యువ నాయకుడు పోలంగి నవీన్, శ్రీకృష్ణ గీత మందిరం యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా విజయవంతం చేశారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 1
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్