నియోజకవర్గ ప్రజలకు సీఐ సంక్రాతి శుభాకాంక్షలు
తిరువూరు జనవరి,14 (వెలుగు నాడు న్యూస్ ) జిల్లా పరిధిలోని,తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ప్రశాంతంగా కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.పండుగ సందర్భంగా పేకాట శిబిరాలు, కోడిపందేలు వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు తావుఇవ్వకుండాసంప్రదాయబద్ధంగా, స్నేహపూర్వక వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఎటువంటి సమస్యలుఎదురైనప్పుడూ వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అందరూ సుఖసంతోషాలతో, శాంతియుతంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సీఐ మనసారా కోరుకున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0