కాలుష్యంతో రక్తంలో తగ్గుతున్న ఆక్సిజన్- తగ్గిన సంతాన ఉత్పత్తి .పరిశ్రమల కాలుష్య నివారణకు చర్యలుశూన్యం.

Jan 15, 2026 - 07:05
 0  0

ఎన్టీఆర్ బ్యూరో జనవరి14 (వెలుగు నాడున్యూస్.)  :  ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని కాలుష్య సమస్యల వలన  పరిసర గ్రామాల ప్రజలలోని రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గి సంతాన ఉత్పత్తికి అవరోధంగా మారింది.మండలంలోని సిమెంటు పరిశ్రమల వల్ల . కెమికల్ రసాయనక పరిశ్రమల కారణంగా పొగ, రసాయనాలు తదితర వ్యర్థలతో. ప్రజల విలవిలలాడుతున్నారు, పరిశ్రమల నిర్వాహకులు వ్యర్ధాల నియంత్రణలో. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో, ప్రజల రోగాల బారిన పడి అనేక అగచాట్లకు గురి గురవుతున్నారు . పరిశ్రమల వల్ల వెలువడే దుమ్ము , పొగ, మరియు రసాయన పరిశ్రమల ద్వారా. అనునిత్యం విడుదల అయ్యే పొగ, వ్యర్ధాలు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు మహిళలు, శ్వాస కోసం చర్మవ్యాధులు. యుక్త వయసులో ఉన్న వారిలో  శరీరంలో ఉన్న రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గించి వేయడం వల్ల సంతాన ఉత్పత్తిని తగ్గించటం. మరికొందరిలో పక్షవాతం వంటి సమస్యలు .ఈ ప్రాంతంలో ఆశించిన రీతిలో పిల్లలు జన్మించడం లేదు.మరి కొందరు చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలలో పనిచేసే సమయంలో వాటి ద్వారా వచ్చే పొగ వల్ల వాహనాలను నడిపేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు, పరిశ్రమలు ఉన్న పరిసర ప్రాంతాలైన రాంకో సిమెంట్, వేదాద్రి సిమెంట్, ముక్తేశ్వరపురం కెసిపి సిమెంట్  బుధవాడ అల్ట్రాటెక్ సిమెంట్. తదితర గ్రామాల్లో పరిశ్రమల వ్యర్ధాల వల్ల. పంటలు కూడా సక్రమంగా పండటం లేదని రైతులు వాపోతున్నారు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్ధాలను వేరుగా స్వీకరించిన వాటిని గోతులు తీసి, వాటిని పూడ్చి వేయాలి. అయితే ఎక్కడ అలాంటి పనులు. జరగటం లేదు రహదారులు పక్కనే గుట్టల గుట్టలుగా వ్యర్ధాలను పడి వేస్తూ ఉండటంతో, దుర్వాసన భరించలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. దీనికి తోడు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలను కాలువ రూపంలో బహిరంగ ప్రదేశాల్లో కి వదులుతుండటతో పరిసర ప్రాంతాల్లోని చెట్లు కూడా, ఏమాత్రం ఎదుగుదల లేక పోతున్నాయి. అధికారులు కాలుష్య నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ, కేవలం సమావేశాలకి పరిమితం అవుతున్నారు అనేది విమర్శలు బహిరంగనా వినబడుతున్నాయి ఏ ఒక్క పరిశ్రమను కూడా కాలుష్య నియంత్రణీ మండలి అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు అధికారులు తనిఖీ చేసి వాటి ద్వారా వచ్చే పొగ, రసాయన రసాయన వ్యర్థలను ఏ విధంగా నియంత్రిస్తారు అన్న, పరిశీలించిన దాఖలాలు లేవు. కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసే అనుమతులు కోసం, నిర్వహించే. సమావేశాలకు మాత్రమే హాజరయ్యి అనంతరం. ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజల నుండి విమర్శలు బహిరంగంగానే వినబడుతున్నాయి . పరిశ్రమలు ఏర్పాటు సమయంలో యాజమాన్యాలు  గ్రామాలను దత్తత తీసుకుంటామని చెబుతూ, అనంతరం  వాటి గురించి పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజాప్రతినిధుల విషయానికొస్తే  ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారితో  మమేకమై పరిశ్రమల నుండి వచ్చే కాంట్రాక్ట్ పనులను కనీసం చేసుకుని ప్రజల బాగోగులను గాలికి వదిలేస్తున్నారు అన్న విషయం బహిరంగ రహస్యమే, అధికారుల ఉదాసీనత కారణంగా పరిశ్రమల. ద్వారా వచ్చే దుమ్ము, దూళి పొగ, వ్యర్ధాలతో ప్రజల ఆరోగ్య సమస్యలతో పాటు రైతులు పండించిన పంట చేతికి అందే పరిస్థితి లేదని రైతులు. ఆయా గ్రామాల రైతు, కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా అధికారులు ప్రజలను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమలు ఏర్పాటు మరియు అనుమతుల విషయంలో దృష్టిలో ఉంచుకొని కాలుష్యం నుండి. వ్యర్ధాలు వల్ల ప్రజలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజల కోరుతున్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్