మానసిక వికలాంగుల ఆశ్రమంలో సంక్రాంతి పండగ.
ఎన్టీఆర్ జిల్లా బ్యూరో జనవరి 14 (వెలుగు నాడు న్యూస్) : మండల కేంద్రమైన హనుమాన్ జంక్షన్లోని ఆశాజ్యోతి మానసిక వికలాంగుల సంక్షేమ ఆశ్రమంలో బుధవారం, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిన్నారులకు స్వయంగా బొట్టు పెట్టి, భోగి పళ్ళు పోసి ఆశీర్వదించిన తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణీ. గత కొన్ని సంవత్సరాలుగా సాయి కళ్యాణి ఆశాజ్యోతి సంక్షేమ ఆశ్రమంకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ ముఖ్యమైన కార్యక్రమమైన ముందుగా ఆశాజ్యోతి సంక్షేమ ఆశ్రమంలోని పిల్లలతో కలిసి గడిపేవారు. వాళ్ళతో బంధం పెనవేసుకుంది. ఆశాజ్యోతిలోకి సాయి కళ్యాణి అడుగు పెట్టాగానే అన్నెం పున్నెం ఎరగని ఆ పిల్లలు చూసి కేరింతలు కొడుతుంటారు. మానసిక దివ్యాంగుల పట్ల ప్రేమను చూపిన సాయి కళ్యాణిని పలువురు అభినందించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0