ముక్త్యాలలో కృష్ణమ్మ చెంత భక్తజన సంద్రం 

Feb 15, 2026 - 23:27
 0  32
ముక్త్యాలలో కృష్ణమ్మ చెంత భక్తజన సంద్రం 

ముక్త్యాలలో కృష్ణమ్మ చెంత భక్తజన సంద్రం 

జగ్గయ్యపేట,ఫిబ్రవరి 15, (వెలుగు నాడు ప్రతినిధి)  : ముక్త్యాల,కోటిలింగాలలో క్షేత్రాలలో మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.ముక్త్యాలవద్ద కృష్ణానదిలో స్నానఘాట్లన్నీజనసంద్రంగామారాయి.పితృదేవతలకు మోక్షం కలుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున పిండప్రదానాలు చేస్తున్నారు.భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది.జగ్గయ్యపేట బస్సు డిపో ఆదివారం ఉదయం నుండే శివరాత్రి జాతర కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతరలో బందో బస్తు నిర్వహిస్తున్నారు.శివరాత్రి పర్వదిన సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని శివాలయాలన్నీ కిటికిటలాడాయి. ఆదివారం ఉదయం నుండే పెద్ద శివాలయం,మఠం శివాలయం,ఏటి ఒడ్డు శివాలయం తదితర శివాలయాలలో దర్శనంకోసం భక్తులు బారులు తీరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్