ఏపీలో అక్టోబర్లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఏపీ విద్యాశాఖ
ఏపీలో అక్టోబర్లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఏపీ విద్యాశాఖ
అమరావతి జూన్ 14, (వెలుగు నాడు ప్రతినిధి ) : ఏపీలో డీఎస్సీ నియామకాల పై వస్తున్న అపోహలను నమ్మొద్దని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డీఎస్సీపై ఇప్పటికే రెండుసార్లు సమగ్ర వివరణ ఇచ్చామని, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అక్టోబర్లో జాబ్ క్యాలెండర్లో భాగంగా మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని వెల్లడించారు. కాల్ లెటర్ రావడం ఉద్యోగం వచ్చినట్లు కాదని, సర్టిఫికెట్ ధ్రువీకరణ కోసమే వాటిని జారీ చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ కోటా సహా అన్ని నియామకాలు నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహించామని అధికారులు వివరించారు.ఎవరికైన ఏమైనా అనుమానాలుంటే కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0