మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవాలి
మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవాలి
సీపీఐ ఆందోళన
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 28,(వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఆందోళన చేపట్టారు..ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని,ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ జలగల మాదిరిగా రక్తం పీల్చుతున్నారన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో సైతం వైద్యం వికటించి మృతి చెందిన సంఘటనలున్నాయి..గ్రామీణ వైద్యులు అనుమతులు లేని మందులను ఉంచుకొని ప్రజలకు వైద్యం పేరుతో దోచుకుంటున్నారన్నారు.మెడికల్ షాపుల వారు జనరిక్ మందుల పేరుతో అనుమతులు లేని ఫార్మా కంపెనీల మందులను మాయ మాటలు చెప్పి ప్రజలకు అంటకడుతున్నారు.మెడికల్ ఆఫీసర్లు తనిఖీలు చేసి వాటిని బహిర్గతం చేయడంలేదు.అధికారులు మెడికల్ మాఫియాను కాపాడుతున్నారని అన్నారు.వెంటనే మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని,ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ జగ్గయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు,సిపిఐ నియోజకవర్గ,పట్టణ నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు,నంబూరి చలపతిరావు,షేక్ చిన్న మీరా,షేక్ కరీం,బోగ్యం నాగులు,కరిసే మధు, సీతారాములు,వేమవరపు ఫ్రాన్సీస్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0