లక్ష్యం దినపత్రిక ఆవిష్కరణ ఎస్‌ఐ వై.వి. శాతకర్ణి
లక్ష్యం దినపత్రిక ఆవిష్కరణ ఎస్‌ఐ వై.వి. శాతకర్ణి
తిరువూరు,జనవరి 22,(వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లక్ష్యం దినపత్రికను సెక్టర్ వన్ ఎస్‌ఐ వై.వి. శాతకర్ణి ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ శాతకర్ణి మాట్లాడుతూ, జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాల్సిన బాధ్యతాయుతమైన వృత్తి అని పేర్కొన్నారు. అదే లక్ష్యంతో లక్ష్యం దినపత్రికను ఆవిష్కరించామని తెలిపారు.ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి దోహదపడే విధంగా ఈ దినపత్రిక పని చేయాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిరికొండ నాగేశ్వరరావు (అభి), గుగులోతు అశోక్, జరపాల ప్రకాష్, సిరికొండ రాజు, అడ్వకేట్ రావూరి నాగరాజు తదితరులు పాల్గొని లక్ష్యం దినపత్రికకు శుభాకాంక్షలు తెలిపారు.లక్ష్యం దినపత్రిక ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, నిజాయితీగల వార్తలతో ప్రజలకు సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0