కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్

Jan 30, 2026 - 19:13
 0  5
కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్

కౌన్సిల్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్

తిరువూరు, జనవరి 30,( వెలుగు నాడు ప్రతినిధి) : ఫిబ్రవరి 13, వ తేదీన నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుంకర రాజేంద్రప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తిరువూరు పట్టణాన్ని సందర్శించి, స్థానిక న్యాయవాదులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, న్యాయవాదుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయవాదుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని పేర్కొంటూ, తనకు ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన స్థానిక న్యాయవాదులను విజ్ఞప్తి చేశారు.న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ స్థాయిలో బలంగా ప్రస్తావించడం, జూనియర్ అడ్వకేట్లకు మెరుగైన అవకాశాలు కల్పించడం, బార్ అసోసియేషన్ల బలోపేతం కోసం కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో తిరువూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతల వెంకటరెడ్డి, సెక్రటరీ మేకల రవి, లీగల్ సెల్ అధ్యక్షులు మేకల నాగేంద్రప్రసాద్ పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే న్యాయవాదులు ఎం. సత్యం, రాజవరపు శ్రీనివాసరావు, జీవన్ బాబు, మర్సకట్ల కుమార్, కోట జమలయ్య, సి.హెచ్. రాజేంద్ర బాబు, ఎం. వెంకటేశ్వరరావు, ఆర్. నాగరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సుంకర రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వానికి తమ మద్దతు ఉంటుందని పలువురు న్యాయవాదులు వెల్లడించగా, ఈ సమావేశం ఎన్నికల ప్రచారానికి మరింత ఉత్సాహాన్ని నింపిందని అభిప్రాయపడ్డారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్