వెంకటేశ్వరరావు కుటుంబానికి చిరు సాయం అందించిన పూర్వ విద్యార్థులు
వెంకటేశ్వరరావు కుటుంబానికి చిరు సాయం అందించిన పూర్వ విద్యార్థులు
తిరువూరు,జనవరి 21( వెలుగు నాడు ప్రతినిధి ) : కంభంపాడు,జిల్లా పరిషత్ హై స్కూల్ 20, 21 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమతో పాటు పదవ తరగతి వరకు చదువుకున్న చిన్ననాటి మిత్రుడు భీమాల వెంకటేశ్వరరావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతు సహాయంగా 5000 రూపాయలు నగదును పూర్వ విద్యార్థుల సంఘం ట్రెజరర్ పల్లబోతుల శబరినాథ్ చేతుల మీదులుగా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ట్రెజరర్ శబరినాథ్ మాట్లాడుతూ తమతోపాటు చిన్న నుండి చదువుకున్న మిత్రుడు భీమాల వెంకటేశ్వరరావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం చాలా బాధాకరమని వైద్య ఖర్చు నిమిత్తం చిరు సాయం అందించడం జరిగిందని ముందు ముందు కుటుంబానికి సహాయంగా ఉంటామని అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
1
Funny
0
Angry
0
Sad
0
Wow
0