రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన

May 14, 2026 - 00:14
 0  15
రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన

రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన

జగ్గయ్యపేట మే13 (వెలుగు నాడు ప్రతినిధి) : వత్సవాయి మండల భీమవరం గ్రామంలో,గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు బుధవారం రసాయన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కెవికె అధిపతి డాక్టర్ ఎం రవి కిషోర్ మాట్లాడుతూ సమతుల్య ఎరువులు వాడటం వలన భూమి సారవంతంగా అయ్యి, నాణ్యమైన దిగుబడులు చేకూరుతాయని వివరించారు. డాక్టర్ పి ఎన్ శివప్రసాద్ (సేద్య విభాగ శాస్త్రవేత్త) మాట్లాడుతూ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వాడకం వలన నేలలో సేంద్రియ పదార్థం పెరిగి రసాయనిక ఎరువులను 15 నుంచి 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని, నేల ఆరోగ్యంతో పాటు నాణ్యమైన దిగుబడులను అర్జించవచ్చునని తెలియజేశారు.భూసార పరీక్షలు ,మట్టి పరీక్షలు,వాటి ఆధారం ద్వారా రసాయనిక ఎరువుల వినియోగం వల్ల సాగు ఖర్చులు తగ్గుతాయని తెలియజేశారు.ఏడీఏ భవాని రైతులకు పిఎండిఎస్ అందించి, నేలలో విచక్షణారహితంగా వాడే రసాయనాలను తగ్గించవలసిందిగా కోరారు. రైతు సోదరులు అందరూ ఏపీ యాప్ ను ఉపయోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి సత్యనారాయణ మేలైన యాజమాన్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలను ఖరీఫ్ కి తీసుకోవడంలో జాగ్రత్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ కె వ్యవసాయ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్