తిరువూరులో పర్యటించిన బిజెపి మహిళా అధ్యక్షురాలు పద్మజ

Jan 28, 2026 - 21:19
 0  14
తిరువూరులో పర్యటించిన బిజెపి మహిళా అధ్యక్షురాలు పద్మజ

తిరువూరులో పర్యటించిన బిజెపి మహిళా అధ్యక్షురాలు పద్మజ

తిరువూరు, జనవరి 28, (వెలుగు నాడు ప్రతినిధి ) : ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పద్మజ బుధవారం. తిరువూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పద్మజ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా కమిటీని, తిరువూరు నియోజవర్గంలోని అన్ని మండలాలలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని, అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని మహిళలకు, ప్రజలకు మరింత చేరువయ్యాలా కార్యక్రమాలు చేస్తూ పార్టీని విజయ పథంలోకి నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి, తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ పెనుగొండ రామచంద్రరావు, తిరువూరు ఎస్ఎంసి చైర్మన్ వెంపాటి అబ్రహం మణిరత్నం, తిరువూరు ఏఎంసీ డైరెక్టర్ అబ్బినేని చంద్రశేఖర్, విస్సన్నపేట శివాలయ కమిటీ నెంబర్ కొత్తూరు ప్రసన్న, లతొ పాటు తిరువూరునియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్