భక్తులకు మజ్జిగ, లస్సీ పంపిణీ
భక్తులకు మజ్జిగ, లస్సీ పంపిణీ
జగ్గయ్యపేట మార్చి14, (వెలుగు నాడు ప్రతినిధి) : తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి విచ్చేసిన భక్తులకు శనివారం నేషనల్ హైవే పక్కనే ఉన్న తిరుమలగిరి దేవస్థానం ఆర్చి వద్ద దివంగత సిపిఐ నాయకులు కామ్రేడ్. మహమ్మద్ మన్సూర్, రిటైర్డ్ ఎమ్మార్వో తెన్నేటి రాధాకృష్ణమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారులు చల్లటి మజ్జిగ మరియు లస్సీ ను పంపిణీ చేశారు.శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ మరియు లస్సీల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు ఆంబోజి శివాజి,నంబూరు చలపతిరావు,షేక్ చిన్న మీరా,పోతుపాక వెంకటేశ్వర్లు,భోగ్యం నాగులు, పిల్లలమర్రి మోహన్,మహమ్మద్ అసదుల్లా, మాశెట్టి రమేష్ బాబు,మెటికల శ్రీనివాసరావు,కరిసే మధు, షేక్ కరీం, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0