ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సీఐటీయూ పిలుపు

Feb 5, 2026 - 02:17
 0  3

ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సీఐటీయూ పిలుపు

జగ్గయ్యపేట ఫిబ్రవరి 04 (వెలుగు నాడు ప్రతినిధి ) : లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12 వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సిహెచ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.మండలంలోని గరికపాడులోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ క్షేత్రంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ యూనివర్సిటీలోని టైం స్కేల్ కార్మికులను మరియు కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏ లను, బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పే రివిజన్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యవసాయ రంగంలో విత్తన సాధన బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యుత్తు సవరణ బిల్లుని ఉపసంహరించాలని కోరుతూ సమ్మె చేయనున్నట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జగ్గయ్యపేట మండల కార్యదర్శి షేక్ గౌస్ మియా, సిఐటియు నాయకులు కోటా రవి, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, రజక వృత్తిదారుల సంఘం నాయకులు భాస్కర్, పద్మ, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్