సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య 

Jan 21, 2026 - 22:53
 0  29
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య 

జగ్గయ్యపేట, జనవరి 21 (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట, మండలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించారు. ఈ క్రమంలో మొత్తం ₹9 లక్షల 44 వేల 341 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్. చెక్కులను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు పంపిణీ చేశారు.జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన 5 మంది.చిల్లకల్లు గ్రామానికి చెందిన 6 మంది,ధర్మవరప్పాడు గ్రామానికి చెందిన 2 మంది.మొత్తం 13 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వారి స్వగృహాలకు వెళ్లి స్వయంగా అందజేశారు.అనారోగ్య కారణాలతో భారీగా వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఊరటగా మారిందని లబ్ధిదారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తమకు అండగా నిలిచే నాయకుడు ఎమ్మెల్యే తాతయ్య గారేనని వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ.పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజల సమస్యలు నా సమస్యలే” అని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు మరియు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్