సీఎం రిలీఫ్ ఫండ్ 7 ఏళ్ల నిరంజన్‌కు జీవనవైభవం

Feb 28, 2026 - 00:49
 0  4
సీఎం రిలీఫ్ ఫండ్ 7 ఏళ్ల నిరంజన్‌కు జీవనవైభవం

సీఎం రిలీఫ్ ఫండ్ 7 ఏళ్ల నిరంజన్‌కు జీవనవైభవం

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేతుల మీదుగా పత్రం అందజేత

తిరువూరు ఫిబ్రవరి 27 (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మోకాలి ఇన్ఫెక్షన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విస్సన్నపేట ఎన్టీఆర్ కాలనీకి చెందిన 7 సంవత్సరాల బాలుడు ఒర్సు నిరంజన్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం లభించింది. ఆపరేషన్ కోసం ₹82,669/- విలువైన ఎల్‌ఓసీ (ఎల్ ఓ సీ ) పత్రాన్ని తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న చిన్నారి కుటుంబానికి ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగించింది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా వెంటనే నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, అలాగే నిరంతరం ప్రజల సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి బాలుడి తాతయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందులు ఎవరినీ వైద్యసేవల నుంచి దూరం చేయకూడదు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తాం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలికపోగు చంటి, రాజవరపు శ్రీనివాసరావు, విస్సన్నపేట పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు మేశపం నవీన్, బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం వల్ల మరో చిన్నారి జీవితంలో ఆశాకిరణం వెలిగింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్