ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Feb 20, 2026 - 01:42
 0  1
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

జగ్గయ్యపేట ఫిబ్రవరి 19 (వెలుగు నాడు ప్రతినిధి) : ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఛత్రపతి సర్కిల్ లోని శివాజీ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శివాజీ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో శాసనసభ్యులు తాతయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు.యువత శివాజీని స్ఫూర్తిని తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం కంటే ముందు పట్టణంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులు ఎన్టీఆర్ చౌక్ నుండి ఛత్రపతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం హిందూ చైతన్య వేదిక ఆధ్యర్యంలో ఛత్రపతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం చినబాబు,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,తాత్వీకులు చిట్టా లక్ష్మీ నరసింహశాస్త్రి,నూకల కుమార్ రాజా, పిన్నం వెంగళరావు,సంకా వెంకట్రావు, సంకా భాస్కరరావు, అల్లీ రవిచంద్, షేక్ ఇజాజ్, పున్నా ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్