అమరజీవికి చిన్నారుల నివాళులు

Mar 17, 2026 - 02:46
 0  7
అమరజీవికి చిన్నారుల నివాళులు

అమరజీవికి చిన్నారుల నివాళులు

జగ్గయ్యపేట మార్చి16 (వెలుగు నాడు ప్రతినిధి) : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని గండ్రాయి గ్రామ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రదానోపాద్యాయులు నేలవెల్లి రమేష్ బాబు విద్యార్థులకు శ్రీరాములు త్యాగనిరతిని వివరించారు.గాంధీ తో పాటు అనేక స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్నారని అన్నారు.తెలుగు వారిపై తమిళుల నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార ప్రారంభించి, 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులయ్యారని అన్నారు.దాని ఫలితంగానే 1953అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, పద్మావతమ్మ ,ముక్తేశ్వరరావు, అంగన్వాడీ టీచర్ తిరపతమ్మ, ఆయా కృష్ణవేణి, వంట ఏజెన్సీ వారు, అసిస్టెంట్ లైబ్రేరియన్. రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్