పాఠశాలల్లో డీఈఓ తనిఖీలు
పాఠశాలల్లో డీఈఓ తనిఖీలు
జగ్గయ్యపేట ఫిబ్రవరి 04 (వెలుగు నాడు ప్రతినిధి ) : పట్టణంలోని బాలుర, బాలికల హైస్కూళ్లలో ఎన్టీఆర్ జిల్లా డీఈవో ఎల్ చంద్రకళ బుధవారం తనిఖీలు చేశారు.పదవ తరగతి ఫలితాల్లో మెరుగుదలకి చేపట్టిన వందరోజుల ప్రణాళికను డీఈఓ సమీక్షించారు.విద్యార్థులతో మాట్లాడి రానున్న 40 రోజులు కఠోర దీక్షతో చదువుకొని చక్కటి మార్కులు సాధించాలని అన్నారు.తల్లితండ్రులు పడుతున్న కష్టాలను మననం చేసుకోవాలని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా చదువుకోవాలని హితవు చెప్పారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0