ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుంది ఉప విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుంది ఉప విద్యాశాఖ అధికారి
పెనుగంచిప్రోలు జూన్ 01, (వెలుగు నాడు ప్రతినిధి): పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో ని సోమవారం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు, నందిగామ డివిజన్ ఉప విద్యా శాఖాధికారి యు.గుర్నాదం అన్నారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా, శనగపాడు నుండి ప్రారంభమైన చైతన్య విద్యారధం, సుబ్బయిగూడెం చేరిన సందర్భంగా, గురునాధం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడానికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి, ఇంటింటికి ప్రచార రధం ద్వారా ఊరూరా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడులే ఉత్తమం అంటూ, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ,గ్రామం మొత్తం తిరిగి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు కె.వెంకయ్య, డి.రవీందర్,గ్రామ పెద్దలు వెల్డి.ప్రభాకరరావు, ఎస్.ఎమ్.సి చైర్మన్ పగడం.సుధాకర్,ఉపాధ్యాయ సిబ్బంది కిలారు.సుధారాణి, మర్రి.ప్రభాకర్,కవిత, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0