వాసిరెడ్డి బెనర్జీని పరామర్శించిన మాజీ ఎంపీ లగడపాటి

Feb 27, 2026 - 22:45
 0  3
వాసిరెడ్డి బెనర్జీని పరామర్శించిన మాజీ ఎంపీ లగడపాటి

వాసిరెడ్డి బెనర్జీని పరామర్శించిన మాజీ ఎంపీ లగడపాటి

జగ్గయ్యపేట ఫిబ్రవరి 27 (వెలుగు నాడు ప్రతినిధి) : శ్రీ తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు వాసిరెడ్డి బెనర్జీ సతీమణి శంకర భవానీ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం పెనుగంచిప్రోలులోని వాసిరెడ్డి బెనర్జీ స్వగృహానికి వచ్చి బెనర్జీని పరామర్శించారు.అనంతరం ఏనుగంచిప్రోలు లో నూతనముగా నిర్మించబడుతున్న శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ చాలా సంవత్సరాల అనంతరం పాత స్నేహితులను కలవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్