స్వచ్ఛ బొప్పాపూర్ దిశగా భవిష్యత్ కార్యాచరణ
స్వచ్ఛ బొప్పాపూర్ దిశగా భవిష్యత్ కార్యాచరణ
దుబ్బాక జనవరి 17 (వెలుగు నాడు ప్రతినిధి ) : సిద్దిపేట జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండలం లో,బొప్పాపూర్ గ్రామాన్ని అక్బర్‌పేట–భూంపల్లి మండల ఎంపీడీవో మరియు ఎంపీ ఓ శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ తో కలిసి గ్రామంలో పర్యటించారు. గత కొంతకాలంగా నిర్వీర్యంగా ఉన్న అభివృద్ధి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని వేగవంతం చేయాలని సూచించారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక పెండింగ్ పనులు, క్రీడా ప్రాంగణం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.అలాగే, నూతనంగా మంజూరైన 10,000 మొక్కల నర్సరీ పనులను ప్రారంభించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.స్వచ్ఛ బొప్పాపూర్ లక్ష్యంగా గ్రామ ప్రజలంతా ఐక్యంగా పనిచేసి, పరిశుభ్రత వైపు అడుగులు వేయాలని అధికారులు పిలుపునిచ్చారు.గ్రామంలో బెల్ట్ షాపుల నిషేధం అమలు చేయడం అభినందనీయమని అధికారులు కొనియాడారు.ఈ కార్యక్రమంలోగ్రామ పంచాయతీ కార్యదర్శి అంజి రెడ్డి,వార్డు హరికృష్ణ గౌడ్,యువకులు లింగం, నరేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0