గాంధీ జీవితం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తి నిస్తాయి దేవినేని ఉమామహేశ్వర రావు
గాంధీ జీవితం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తి నిస్తాయి దేవినేని ఉమామహేశ్వర రావు
గొల్లపూడి,జనవరి 30, (వెలుగు నాడు ప్రతినిధి ) : మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండినదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. మహాత్ముని 78వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలసి బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, మహాత్ముని ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోందన్నారు. శాంతి, సత్యాగ్రహాల మార్గంలో గాంధీజీ బ్రిటిష్ వారిని ఎదిరించి, ప్రజలను సంఘటితం చేసి స్వరాజ్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన అహింసా సిద్ధాంతం దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎందరో పోరాట యోధులకు స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేసారు. ఇదే రోజున అమరవీరుల దినోత్సవంగా జాతీయోద్యమంలో గాంధీజీ పాత్రను స్మరించుకోవడానికి, స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గౌరవించడానికి ఉద్దేశించబడిందన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0