వైభవంగా శ్రీ శ్రీ బీరయ్య స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
వైభవంగా శ్రీ శ్రీ బీరయ్య స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
ముఖ్య అతిథులుగా
మంత్రి సవిత,ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు, ఎమ్మెల్యే చింతమనేని .
కృష్ణాజిల్లా బ్యూరో మే 13,( వెలుగు నాడు ప్రతినిధి) : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో శ్రీ శ్రీ బీరయ్య స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్‌లకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం నూతనంగా ప్రతిష్టించిన బీరయ్య స్వామిని వారు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా కురుమ సంఘం,దేవస్థాన కమిటీ పెద్దలను,పుణ్య దంపతులను కలిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలోని కాకులపాడు గ్రామంలో తమ కులదైవమైన బీరయ్య స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు కుల బాంధవుల కోసం భజన మందిర నిర్మాణానికి టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోరిన విధంగా బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగాజరుగుతున్నాయని,ఈ నియోజకవర్గంలోని హాస్టళ్లను కూడా త్వరలోనే ఆధునీకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఆమె పునరుద్ఘాటించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ,తమ నియోజకవర్గ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ద్వారా 15,000 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, సీఎస్ఆర్ నిధుల ద్వారా శిక్షణ కేంద్రాలు, హెచ్‌సిఎల్ కంపెనీ సహకారంతో హాస్టళ్లలో ఆర్‌ఓ ప్లాంట్లు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.తాను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటాన్ని గమనించానని,అందుకే మంత్రి సవిత చొరవతో నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు హనుమాన్ జంక్షన్ కూడలిలోని అభయ అనజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ర్యాలీ గా కాకులపాడు గ్రామం చేరుకున్న నేతలకు గ్రామ నాయకులు, కురభ సంఘం నేతలు గజ మాలతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు,విజయ్ విద్యా సంస్థల చైర్మన్ తట్టి అర్జునరావు అధ్యక్షత వహించారు , ఈ కార్యక్రమంలో కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర అప్పన్న, రాష్ట్ర కురుమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి ప్రసాద్, గుంటూరు జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మర్రి సత్యనారాయణ,కృష్ణా జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు,మల్లయ్య స్వీట్స్ అధినేత గౌరా వెంకటేశ్వరరావు,వెస్ట్ గోదావరి కురుమ సంఘం ప్రెసిడెంట్ దన్నే అశోక్, బీరయ్యస్వామి దేవాలయం ప్రెసిడెంట్, కృష్ణాజిల్లా కురుమ సంఘం సెక్రటరీ ఎనికేపల్లి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పడకల రాజశేఖర్,కాకులపాడు గ్రామ టిడిపి అధ్యక్షులు చెన్నుబోయిన వీర వెంకట్రావు,గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త చలమలశెట్టి రమేష్ బాబు,బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, కొమ్మారెడ్డి రాజేష్, చలసాని శ్రీనివాసరావు, అన్నె చైతన్య,పుట్టా సురేష్, మూల్పూరి సాయి కళ్యాణి, ఆళ్ల గోపాలకృష్ణ,మొవ్వ వేణుగోపాల్,వేగిరెడ్డి పాపారావు,జాస్తి భూపతి, ,యజ్జువరపు శ్రీనివాసరావు,మున్నంగి శేషగిరిరావు,దన్నే గాంధీ,దన్నే దుర్గారావు,చెన్నుబోయిన అంజయ్య,చింతల వెంకట శివ అప్పారావు, చెన్నుబోయిన నాగరాజు, , యజ్జువరపు రంగారావు, అట్లూరి శ్రీనివాసరావు, ఎనికేపల్లి నారాయణ,, ఎనికేపల్లి రాఘవేంద్రరావు,ముదిగిరి నాగేశ్వరరావు,జోగు సుబ్రహ్మణ్యం, చెన్నుబోయినమల్లిఖార్జునరావు,కొల్లూరు చంద్రకాంత్ మరియు స్థానిక భక్తులు, కురుమ సంఘం నాయకులు,ఎన్డీయే కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0