పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

May 19, 2026 - 11:53
 0  4
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

వైసీపీ నిరసన ర్యాలీ

జగ్గయ్యపేట,మే18, (వెలుగు నాడు ప్రతినిధి)  : పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని జగ్గయ్యపేట పట్టణంలోని నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి వైసీపీ శ్రేణులు తాసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,తహసీల్దార్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు, అనంతరం స్థానిక ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజక వర్గ ఇంచార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పొదుపు పేరుతో కూటమి ప్రభుత్వం జనాలను మభ్యపెడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు ఐనా ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు.అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఏపీలో పెట్రోలు, డీజిల్ రేట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి సామాన్య ప్రజల్ని వెసులుబాటు కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజున్నిసా, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నర్సింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్కపుడి గాంధీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శ్యామల్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్ తోపాటు జిల్లా ,నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్