డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో వంద పడకల అభివృద్ధి పనుల పరిశీలన

Jan 21, 2026 - 22:40
 0  4

నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచన.

నందిగామ, జనవరి 21,(వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ పట్టణంలోని గవర్నమెంట్ డివిఆర్ ఏరియా హాస్పిటల్ నందు శరవేగంగా కొనసాగుతున్న వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ కమిటీ చైర్మన్, సంబంధిత అధికారులు మరియు కూటమి నేతలతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఆసుపత్రి అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.వంద పడకల ఆసుపత్రి రూపుదిద్దుకుంటే నందిగామ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు,సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్