న్యాయవాదులకు ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణకు సూచన

May 16, 2026 - 22:01
 0  9
న్యాయవాదులకు ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణకు సూచన

న్యాయవాదులకు ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణకు సూచన

నందిగామ మే 16,( వెలుగు నాడు ప్రతినిధి) : 16వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి. శ్రీనివాసరావు ని, ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ కొప్పుల కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా న్యాయవాదులు మరియు న్యాయవాది సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించాలని జడ్జి సూచించారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, తదితర అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయనున్నట్లు తెలిపారు. శిబిరం నిర్వహణ తేదీని అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో, అలాగే ప్రతిరోజూ నందిగామ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ కొప్పుల కృష్ణమోహన్ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈసదవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్