శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ప్రారంభించిన కొలుసు పార్థసారథి
శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ప్రారంభించిన కొలుసు పార్థసారథి
విస్సన్నపేట, మార్చి 21, (వెలుగు నాడు ప్రతినిధి) : స్థానిక మండలంలోని నరసాపురం గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఆంధ్ర భద్రాద్రిగా పిలవబడే చనుబండ శ్రీ శ్రీ కోదండరామ స్వామి వారి ( శ్రీరామనవమి ) కళ్యాణ ఉత్సవ మహోత్సవ పోస్టర్ ను గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి విడుదల చేశారు. టిడిపి సీనియర్ నాయకులు ఆర్.బి.ఎస్ జాతీయ అధ్యక్షులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు పట్టు వస్త్రాలతో ఆయనను ఘనంగా సన్మానించారు. 17వ శతాబ్దం నాటి శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ శ్రీ శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయం చనుబండ గ్రామంలో ఆంధ్ర భద్రాచలం గా పేరుగాంచటం నూజివీడు నియోజకవర్గం శాసన సభ్యునిగా నాకు సంతోషంగా ఉన్నది అన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ మహోత్సవ కార్యక్రమాలకు రావలసిందిగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి మంత్రి పార్థసారధిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు నాగరాజు, చెన్నారావు నారాయణ నరసింహారావు చాట్రాయి మండలం మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, మోరంపూడి రమేష్ దుర్గారావు మారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 27వ తేదీ బుధవారం నుండి 30వ తేదీ సోమవారం వరకు అయోధ్య నగరాధీశులు శ్రీ దశరథ మహారాజు తనయులు శ్రీ శ్రీ శ్రీ కోదండరామ స్వామి వారికి మిథిలా నగర నగరాధిసులు శ్రీ జనక మహారాజు పుత్రిక సీతాదేవి అమ్మవారికినీ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ చెన్నారెడ్డి తెలియజేశారు. శ్రీ స్వామివారి తిరు కళ్యాణం 27వ తేదీ శుక్రవారం ఉదయం 12:35 నిమిషాలకు జరగనున్నట్లు చెప్పారు. స్వస్తిశ్రీ చంద్రమనేనా శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ సప్తమి నుండి క్షేత్ర శుద్ధ ద్వాదశి వరకు అనగా బి 25 నుండి 30 వ తేదీ వరకు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఖమ్మం వాస్తవ్యులు శ్రీమాన్ యతిరాజా నచ్చికేతనాచార్యులు ఆధ్వర్యంలో దీక్షతో కళ్యాణ మండపము నందు శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును అని భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0