మోడీ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలివామ పక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీ
మోడీ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలివామ పక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీ
జగ్గయ్యపేట ఫిబ్రవరి 12 (వెలుగు నాడు ప్రతినిధి) : వామపక్ష కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె పిలుపు నేపద్యంలో జగ్గయ్యపేట పట్టణంలో ఎఐటియుసి,సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాలుగు కార్మిక కోడ్ ల అమలు వ్యతిరేకిస్తూ గురువారం ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి,సిఐటియు నాయకులు మాట్లాడుతూ నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారని అన్నారు..2025 నవంబర్ 21వ తేదీ నుండి 4 కార్మిక కోడ్లను అమలుచేయాలని పూనుకున్నారు. రాజ్యాంగ స్ఫూర్తినీ, సుప్రీం కోర్టు తీర్పులనూ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నిటిని భూస్థాపితం చేయసంకల్పించారు.4 కార్మిక కోడ్ లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పంటల గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని రైతాంగం చేస్తున్న డిమాండ పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే రైతు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయన్నారు.మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రయోజనాలకోసం, "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" పేరుతో "జన్ విశ్వాస్" అనే చట్టాన్ని తీసుకువచ్చింది.చట్టబద్ధ కార్మిక హక్కులపై యథేచ్ఛగా దాడికి పాల్పడేందుకు పారిశ్రామిక యాజమాన్యాలకు స్వేచ్ఛను ప్రసాదించారు. విచ్చలవిడి ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించాలని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు మెటికల శ్రీనివాసరావు,షేక్ కరీం,ఆర్.టి.సి షేక్ చిన్న మీరా,భోగ్యం నాగులు,వేమవరపు ఫ్రాన్సీస్,షేక్ అసదుల్లా, నంబూరి చలపతిరావు, బి సీతారాం,సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ కమల,సిఐటియు నాయకులు యస్.నాగమణి, షేక్ గౌస్,జె వెంకట్రావు,దంతాల నరేంద్ర,కాకనబోయిన లింగారావు,కోట కృష్ణ,కోట రవి,దాసరి బాస్కర్,యుటియఫ్ యం కృష్ణయ్య నరసింహారావు తదితరులు కార్మికులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0