ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

Jun 1, 2026 - 20:17
 0  14
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

జగ్గయ్యపేట జూన్01,(వెలుగు నాడు ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలోని 25వ వార్డు క్రిస్టియన్‌పేటలో అర్హులైన వృద్ధులు, వికలాంగులు మరియు వితంతు మహిళలకు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) స్వయంగా పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఎమ్మెల్యే , ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వార్డు కౌన్సిలర్ కర్ల జోజి , సచివాలయ కార్యదర్శులు, కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్