పట్టణంలో వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే తాతయ్య
పట్టణంలో వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే తాతయ్య
జగ్గయ్యపేట ,ఫిబ్రవరి 09, (వెలుగు నాడు ప్రతినిధి ) : పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి సోమవారం పట్టణంలోని 1, 2 వార్డులలో పర్యటించారు.క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో వారు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రజలు తమ వార్డుల్లో ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తాగునీరు, సిమెంట్ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు.వార్డు ప్రజలు ప్రధానంగా కోరుతున్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ 3 కోట్ల భారీ నిధులను డిఎంఎఫ్ గ్రాంట్స్ ద్వారా కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.రానున్న 10 రోజుల్లోనే పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టి, నాణ్యతతో వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జగ్గయ్యపేట పట్టణాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.ప్రతి గల్లీలోనూ మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు,అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు,ఎల్ ఎస్ సీ ఎస్ సొసైటీ చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్స్ సామినేని మనోహర్, కన్నెబోయిన రామలక్ష్మి, ఇర్రి నరసింహారావు, కొలగాని రాము,మున్సిపల్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0