సైకిలెక్కిన ఎమ్మెల్యే

May 22, 2026 - 21:04
 0  2
సైకిలెక్కిన ఎమ్మెల్యే

సైకిలెక్కిన ఎమ్మెల్యే

జగ్గయ్యపేట,మే 22, (వెలుగు నాడు ప్రతినిధి)  : నియోజకవర్గ ప్రజలతో మరింత చేరువ కావడంతో పాటు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శుక్రవారం సైకిల్ పై ప్రయాణం చేశారు.జగ్గయ్యపేట పట్టణం నుండి ఆర్టీసీ బస్సులో పెనుగంచిప్రోలు వరకు ప్రయాణించిన ఎమ్మెల్యే,అనంతరం పెనుగంచిప్రోలు గ్రామం నుండి అనిగండ్లపాడు గ్రామానికి స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి అక్కడ నిర్వహించిన ప్రజా దర్బార్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలతో కలిసి సాధారణ జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని ఆయన టీడీపీ నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చింతల సీతారామయ్య, కొఠారు సత్యనారాయణ ప్రసాద్, కళ్యాణం కృష్ణారావు,వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్