ప్ర‌భుత్వాసుప‌త్రిలో న‌ర్సింగ్ సిబ్బందితో ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌మావేశం, .. .త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి విన‌తి ప‌త్రం అంద‌జేత

Jan 24, 2026 - 23:49
 0  24
ప్ర‌భుత్వాసుప‌త్రిలో న‌ర్సింగ్ సిబ్బందితో ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌మావేశం, .. .త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి విన‌తి ప‌త్రం అంద‌జేత

ప్ర‌భుత్వాసుప‌త్రిలో న‌ర్సింగ్ సిబ్బందితో ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌మావేశం, .. .త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి విన‌తి ప‌త్రం అంద‌జేత

 విజయవాడ,జనవరి24,( వెలుగు నాడు ప్రతినిధి) : ప్ర‌తిరోజు నాలుగు వేలకి పైగా ఓపీ చూసేవిజ‌య‌వాడ,ప్ర‌భుత్వాసుప‌త్రిలో న‌ర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను రెండు మూడు నెల‌ల్లో ప‌రిష్క‌రిస్తామ‌ని,పెద్ద స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు.ప్ర‌భుత్వాసుప‌త్రిలో శ‌నివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ న‌ర్సింగ్ సిబ్బందితో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. న‌ర్సింగ్ సిబ్బందితో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు న‌ర్సింగ్ సిబ్బంది విన‌తి ప‌త్రం అంద‌జేశారు.అనంత‌రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వాసుప‌త్రిలో ముఖ్యంగా బ్యాక్ ఎండ్ ఆపరేటర్లు మరింత అవసరమని పేర్కొన్నారు. తాత్కాలిక ఉద్యోగాల నియామకంలో కొంత సమస్య ఉందని కూడా తెలిపారు. నర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను రాబోయే ఆసుపత్రి కమిటీ సమావేశంలో చర్చించి వెంటనే పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రోగులకు సేవలందించడంలో నర్సింగ్ సిబ్బంది ఎక్కడా రాజీపడకుండా అంకితభావంతో పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినందించారు.ఈ స‌మావేశంలో గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు, సూప‌రింటెండెంట్ నర్సింగ్ విజ‌య‌ల‌క్ష్మీ, గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్ డెవ‌ల‌ప్మెంట్ క‌మిటీ స‌భ్యుడు గుమ్మ‌డి కృష్ణారావు, ఆర్.ఎమ్.వో మంగాదేవి, సి.ఎస్.ఆర్.ఎమ్.వో ప‌ద్మావ‌తి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్