ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదులు వేస్తున్న మంత్రి నారా లోకేష్ 

Jan 22, 2026 - 23:28
 0  5
ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదులు వేస్తున్న మంత్రి నారా లోకేష్ 

ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదులు వేస్తున్న మంత్రి నారా లోకేష్ 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ జనవరి 22 (వెలుగు నాడు ప్రతినిధి) : యువ నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తూ, ప్రజాసేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్న నాయకత్వం నారా లోకేష్‌దని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు. పరిపాలనలో ఆధునిక దృక్పథం, యువత ఆశయాలకు అనుగుణమైన ఆలోచన విధానం, ప్రజలకు చేరువయ్యే రాజకీయ శైలి ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని పేర్కొన్నారు.ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దటంలో విద్య,ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా నారాలోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు విద్యా వ్యవస్థ లో విప్లవాత్మక మార్పులుతీసుకువచ్చారు. .రాష్ట్ర ప్రగతికి రథసారథిగా అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నార‌నికొనియాడారు.

రాజకీయ నీతిజ్ఞుడు, అపర చాణుక్యుడు. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడిగా కాకుండా తనదైన శైలిలో దూసుకువెళుతున్నారంటూ కొనియాడారు. గెలుపు సాధించే విషయంలో ఎంతో పట్టుదలగా కృషి చేసి అందుకోవటం ద్వారా యువతకు స్పూర్తిగా నిలిచారన్నారుయువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నాలుప్రశంసనీయమని,భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదులు వేస్తున్న నాయకుడిగా నారా లోకేష్ ఎదుగుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా నారా లోకేష్‌కు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని, రాష్ట్రాభివృద్ధికి మరింత బలమైన నాయకత్వాన్ని అందించాలని కోరుకుంటూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్